ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్..ఓ వైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉంటూనే…మ‌రో వైపు సినిమా ఫంక్ష‌న్ ల‌కు హాజ‌ర‌వుతున్నాడు. ఇటీవ‌ల రంగ‌స్థ‌లం గ్రాండ్ స‌క్స‌స్ మీట్ కు ప‌వ‌న్ హాజ‌రై టీమ్ ని అభినందించారు. ఆత‌ర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా స‌క్స‌స్ మీట్ కు, ర‌వితేజ నేల టిక్కెట్టు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు ప‌వ‌న్ హాజ‌ర‌య్యారు. తాజాగా మ‌రో సినిమా వేడుక‌కు కూడా వ‌చ్చేందుకు ఓకే చెప్పార‌ని తెలిసింది. ఇంత‌కీ..ఏ సినిమా ఫంక్ష‌న్ కి అనుకుంటున్నారా..?   సాక్ష్యం ఆడియో ఫంక్ష‌న్ కి.

ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – పూజా హేగ్డే జంట‌గా న‌టించారు. శ్రీవాస్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈనెల 26న ఆడియో ఫంక్ష‌న్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిధిగా రావాల‌ని ప‌వ‌న్ ని ఆహ్వానించ‌గా..అలాగే వ‌స్తాన‌ని మాట ఇచ్చార‌ట‌. ప‌వ‌న్ ఈ ఈవెంట్ కి వ‌స్తే..సాక్ష్యం పై మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని రెండు పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది.

భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఓ కొత్త క‌థాంశంతో రూపొందుతోన్న సాక్ష్యం సినిమా పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి…సాక్ష్యం ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here