అగ్ర క‌థానాయ‌కుల పుట్టిన‌రోజు…అభిమానుల‌కు పండ‌గ రోజు. అందుక‌నే..హీరోలు త‌మ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఇలా ఏదో ఒక‌టి రిలీజ్ చేస్తూ…అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంటారు. ఇక మే 20  వ‌చ్చిందంటే..తార‌క్ ఫ్యాన్స్ కి ఫెస్టివ‌లే. ఎందుకంటే..ఆ రోజు తార‌క్ పుట్టిన‌రోజు. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

తార‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈనెల 20 తార‌క్ లుక్ రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఈ మూవీలో లుక్ కోసం తార‌క్ చాలా హార్డ్ వ‌ర్క్ చేసారు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా తార‌క్ లుక్ రిలీజ్ చేయ‌నున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీకి అసామాన్యుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే…ఎన్టీఆర్ చ‌ర‌ణ్ తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ న్యూస్ కూడా అదే రోజున ఎనౌన్స్ చేయ‌నున్నార‌ట‌. అక్టోబ‌ర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here