బిచ్చగాడు చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించి… తెలుగులో పాపులర్ అయిన హీరో విజ‌య్ ఆంటోని. వైవిధ్య‌మైన క‌థాంశంతో విజ‌య్ ఆంటోని న‌టించిన తాజా చిత్రం కాశి. ఈ సినిమా ఈనెల 18న  ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. ప్ర‌మోష‌న్ లో భాగంగా ఈ మూవీ తొలి ఏడు నిమిషాల సినిమాను విడుదల చేశారు.

ఇందులో.. ఒక పాముతో సినిమాను స్టార్ట్ చేయడం…అమ్మా.. నీకో విషయం చెప్పనా?  నాకెప్పుడూ ఓ కల వస్తుందని చెప్తాను కదా.. ఓ చిన్నపిల్లాడిని ఎద్దు పొడిచినట్టు, పెద్ద పాము వచ్చినట్టు.. నా గత జీవితంతో ఏదో జరిగి ఉంటుందనిపిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో అయి ఉంటుందమ్మా. అదే కలలాగా వస్తుంది. ఒక్కసారి ఇండియాకి వెళ్లి.. నా చిన్నప్పుడు ఏం అయిందో.. తెలుసుకుని వస్తానమ్మా..’అని చెబుతాడు. దీనిని బ‌ట్టి ఈ మూవీ గత జన్మల నేపథ్యంతో రూపొందించిన‌ కథగా తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో విజయ్ ఆంటోనీ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.  మ‌రి..ఈ ఏడు నిమిషాల ప్ర‌మోష‌న్ వ‌ర్క‌వుట్ అయి కాశికి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here