అక్కినేని అఖిల్ తొలి చిత్రం అఖిల్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డం…ఆత‌ర్వాత ద్వితీయ చిత్రం హ‌లో ఫ‌ర‌వాలేద‌నిపించినా..క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డంతో అక్కినేని వంశాభిమానులంద‌రూ ఎప్పుడెప్పుడు అఖిల్ సెన్సేష‌న‌ల్ మూవీని అందిస్తాడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో అఖిల్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం అఖిల్ టీమ్ లండ‌న్ లో లోకేష‌న్స్ వేట‌లో ఉన్నారు. ఈనెల 19న టీమ్ ఇండియాకి రానున్నారు. ఆత‌ర్వాత ఈనెల 29 నుంచి లండ‌న్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసార‌ని స‌మాచారం. ఈ మూవీకి ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే మూడు పాట‌ల రికార్డింగ్ కూడా కంప్లీట్ చేసారు. అఖిల్ స‌ర‌స‌న స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. హ‌లో త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు విని ఫైన‌ల్ గా వెంకీ అట్లూరి స్టోరీకి ఓకే చెప్పాడు.

అఖిల్ లుక్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని…డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి…ఈ మూవీ అయినా అఖిల్ కి సూప‌ర్ స‌క్స‌స్ అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here